తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. ప్రచారం క్రమంగా ఊపందుకుంటున్నది ముఖ్యంగా తమిళనాడులో ఏఐడిఎంకె, డిఎంకే, డిఎండికె పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ జరగనున్నట్టు తెలుస్తున్నది. అయితే, అమ్మ పథకాలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఇక, డిఎంకె పార్టీ కూడా ఎలాగైనా అధికారం చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. డిఎంకె పార్టీ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నది. జయలలిత ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. ఎప్పుడు శ్రీరంగం నుంచి పోటీ చేసే అమ్మ.. ఇప్పుడు చెన్నైలోని ఆర్ కే నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. తమిళ ప్రజల మనసులో ఏమున్నదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
నువ్వా నేనా.. సై తమిళ పార్టీలు..!
Thursday, April 21st, 2016, 10:19:38 AM IST