మంచి తరుణం మించిన రాదు.. బాలయ్య చెలరేగిపో

Thursday, May 26th, 2016, 11:31:14 AM IST


ప్రస్తుతం టీడీపీలో భవిష్యత్ వారసత్వంపై తీవ్ర స్తబ్దత నెలకొని ఉంది. బాబు తరువాత తమను ముందుకు నడిపే న్యాయకత్వం కోసం కేడర్ ఎదురుచూపులు చూస్తోంది. తన తరువాత వారసుడిగా బాబు తన కుమారుడు లోకేష్ ను జనాల్లోకి, కేడర్ లోకి తీసుకెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ చినబాబు లోకేషే మాత్రం దాన్ని అందుకోవడంలో వెనుకబడ్డారు. జాతీయ కార్యదర్శి పదవి కట్టబెట్టి, గ్రేటర్ భాద్యతలను నెత్తిన పెడితే లోకేష్ ఆ కార్యసాధనలో విఫలమై పూర్తిగా చేతులెత్తేశారు.

దీంతో పార్టీ క్యాడర్ వారసత్వం విషయంలో ఆల్టర్నేట్ కోసం వెతుకుతూ నందమూరి వారసుడు బాలయ్య వైపు చూస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బాలయ్యలో ఒక యువకుడిలో ఉండాల్సిన దూకుడు, తెగింపు ఉన్నాయి. అనుకున్నది అనుకున్నట్టు చేసే ధైర్యం ఉంది. అలాగే రాష్ట్ర, దేశ రాజకీయ పరిస్థితులపై కూడా మంచి అవగాహన ఉంది. పైగా తారకరాముడి అదృశ్య శక్తి సైతం బాలయ్య వెనకే ఉంది. అందుకే పార్టీ క్యాడర్ కూడా బాలయ్యే నెక్స్ట్ జెనరేషన్ లీడర్ కావాలని లోపల అనుకుంటున్నా బయటపడలేకపోతున్నారు. కనుక బాలయ్యే చొరవ తీసుకుని వచ్చిన ఈ మంచి తరుణాన్ని సద్వినియోగం చేసుకుని నందమూరి వారసత్వాన్ని నిలబెట్టాలని వాళ్ళంతా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.