ఉద్యమానికి పిలుపునిస్తున్న తెలుగుదేశం పార్టీ..!

Saturday, July 4th, 2020, 08:56:06 AM IST

ఏపీ ముఖ్యమంత్రి గా వై ఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం తీసుకున్న ఎన్నో సంచలన నిర్ణయాలలో రాజధాని తరలింపు నిర్ణయం కూడా ఒకటి అని చెప్పాలి. జగన్ ఎన్నికల ముందు వరకు కూడా అమరావతి విషయంలో ఒక స్టాండ్ పై ఉండి ఎన్నికలు అయ్యాక మాట మార్చడంతో ఏపీ రాజకీయ వర్గాల్లోనూ మరియు రాజధాని రైతుల విషయంలోను కలకలం రేగింది.

దీనితో అమరవతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. ఏపీలో కరోనా కల్లోలం సృష్టించినా సరే వారి పోరాటాన్ని ఆపలేదు. అయితే టీడీపీ హయాంలో అక్కడ భారీ అవినీతి జరిగిందని వైసీపీ నేతలు అంటున్న మాట.దీనితో ఈ అంశాన్ని టీడీపీ అధిష్టానం మరింత సీరియస్ గా తీసుకున్నారు.

ఈరోజు తెలుగు నేల స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి మరియు అమరావతి నిరసనలకు 200 వందల రోజులు ఒకేసారి రావడంతో అల్లూరి గిరిజనుల కోసం చేపట్టిన ఉద్యమం జాతీయ ఉద్యమంగా మారింది అని అదే విధంగా అమరావతి విషయంలో ఉద్యమం చెయ్యడానికి తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తుంది అని వారు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు.