ఫేక్ ప్రచారం చేసుకోవడం లో మీకు మీరే సాటి – టీడీపీ

Thursday, June 10th, 2021, 08:40:02 AM IST

TDP_1706

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన లో రాష్ట్రానికి 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అంటూ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీని పై తెలుగు దేశం పార్టీ నేతలు మాత్రం వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. ఫేక్ ప్రచారం చేసుకోవడం లో మీకు మీరే సాటి అంటూ తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా లో విమర్శలు గుప్పిస్తుంది. అంతేకాక తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులను వైసీపీ ప్రభుత్వం లో వచ్చినట్లు ట్విట్టర్ లో మీడియా లో మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పుకొచ్చారు అంటూ విమర్శలు చేసింది టీడీపీ. అయితే 2017 లో వచ్చిన కియా ను 2019 లో చేర్చిన వైసీపీ ప్రభుత్వం అంటూ విమర్శించింది. అంతేకాక మంత్రి అయ్యుండి అబద్ధాలా అంటూ సూటిగా ప్రశ్నించడం జరిగింది. పోనీ 2005 రాజన్న టైమ్ లో వచ్చిందని చెప్పాల్సింది అంటూ సెటైర్స్ వేయడం జరిగింది. అయితే ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ, టీడీపీ చేసిన వ్యాఖ్యల కి ఎలా స్పందిస్తారో చూడాలి.