ప్రజలను ఏకం చేసేది టిడిపినే!

Saturday, December 6th, 2014, 09:01:29 PM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో శనివారం తెలంగాణ టిడిపి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు, ఆ తర్వాత పార్టీ నేతలంతా కలిసున్నది ఒక్క తెలుగుదేశం పార్టీలోనే అని పేర్కొన్నారు. అలాగే టిడిపిలో నేతలంతా విభజనతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకే తాటిపై నిలిచారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ అసలు విభజన చట్టాన్ని ఎవరు ఉల్లంఘించారో ప్రజలు గమనించాలని, ఎప్పటికైనా తెలుగు ప్రజలను తెలుగుదేశం పార్టీనే ఒక్కటి చేస్తుందని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ నుండి టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ టిడిపి కార్యకర్తలే బుల్లెట్లు, వారికి భయం అవసరం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక కూర్చుని సమస్యలను పరిష్కరించుకుందామని తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు సూచనలు చేశారు.