నారా లోకేష్ విసిరిన సవాల్ కి తోకముడిచావు – అచ్చెన్నాయుడు

Tuesday, April 13th, 2021, 03:47:59 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వూ నీ దొంగ సాక్షి ఎన్ని తప్పుడు వీడియోలు వేసినా టీడీపీ లో విభేదాలు సృష్టించలేవు జగన్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారి నాయకత్వములో తిరుపతి ఎన్నికకు ఐకమత్యం గా పని చేస్తుండటం తో నీకు ఓటమి భయం పట్టుకుంది అంటూ చెప్పుకొచ్చారు. నారా లోకేష్ విసిరిన సవాల్ కి తోక ముడిచావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే నిన్న బాబు గారి సభ పై రాళ్లేయించావు అని ఆరోపణలు చేశారు. ఈ రోజు నా సంభాషణలను వక్రీకరించావు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్ని విష పన్నాగాలు పన్నినా తెలుగు దేశం విజయాన్ని ఆపలేవు అంటూ చెప్పుకొచ్చారు. నారా లోకేష్ తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు అంటూ వ్యాఖ్యానించారు. అయితే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.