డెత్ సర్టిఫికెట్ పై నీ బొమ్మ ముద్రించి ఇవ్వు జగన్ రెడ్డి – టీడీపీ నేత

Sunday, May 9th, 2021, 03:02:57 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వలనే ఇలా జరుగుతున్నాయి అంటూ తెలుగు దేశం పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఈ మేరకు తెలుగు దేశం పార్టీ కీలక నేత పట్టాభిరామ్ ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నీ అసమర్ధత చేతగాని తనం వలన ప్రాణాలు కోల్పోతున్న వారికి ఇచ్చే డెత్ సర్టిఫికెట్ ల పైన కూడా నీ బొమ్మ ముద్రించి ఇవ్వు జగన్ రెడ్డి అంటూ పట్టాభిరాం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే అలా చేయడం వలన నీకు నీ ప్రచార పిచ్చ తగ్గుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తమ కుటుంబ సభ్యులను, ఆప్తులను కోల్పోయిన వాళ్ళు కూడా నీ నిర్వాకాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే పట్టాభిరం చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.