అందుకే పరిషత్ ఎన్నికలు బహిష్కరించాం.. టీడీపీ నేత వర్ల రామయ్య కీలక వ్యాఖ్యలు..!

Wednesday, April 7th, 2021, 02:00:27 AM IST


వైసీపీ సర్కార్‌పై టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి మరీ కోర్టు నుంచి తమకు ఉత్తర్వులు అనుకూలంగా తెచ్చుకోవాలన్న ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు. మూటలు ఖర్చు పెట్టైనా ఎన్నికలు నిర్వహించేలా చూడాలని ఓ మంత్రి కామెంట్లు చేస్తున్నారని, న్యాయవ్యవస్థను కించపరిచేలా ప్రభుత్వ తీరు ఉండడం సరికాదని అన్నారు.

అయితే నాలుగు వారాల పాటు కోడ్ అమలు చేయాలనే సుప్రీం తీర్పు సూచనలు జారీ చేసిందని అయితే నిబంధనలు ఉల్లంఘించి ఇచ్చిన నోటిఫికేషన్‌ను కోర్టు తప్పు పడితే ప్రభుత్వం సిగ్గు లేకుండా అప్పీలుకు వెళ్తోందని అన్నారు. ప్రభుత్వం అప్పీలుకు వెళ్లినా తీర్పు మాత్రం మాకు అనుకూలంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. పరిషత్ ఎన్నికల్లో ప్రభుత్వం రూల్స్ పట్టించుకోకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తోందనే మేం ఎన్నికల్ని బహిష్కరించాం అని వర్ల రామయ్య చెప్పుకొచ్చారు.