వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేసిన బాలకృష్ణ.. ఎందుకంటే?

Thursday, April 1st, 2021, 06:16:16 PM IST

నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజాకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్ చేశారు. ఎమ్మెల్యే రోజాకు ఇటీవల శస్త్రచికిత్సలు జరిగిన సంగతి తెలిసిందే. చెన్నై ఆపోలో ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్న ఆమె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. అయితే తాజాగా బాలకృష్ణ కూడా రోజాకు ఫోన్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితి గురుంచి అడిగి తెలుసుకుని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అయితే బాలకృష్ణ నుంచి ఫోన్ రావడంపై ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు రోజా కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఫీలైనట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే రోజాను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీ నేతలు పరామర్శించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తదితరులు కూడా చెన్నై వెళ్లి రోజాను పలకరించి వచ్చారు.