రెండేళ్లలో ఏం అభివృద్ది చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి – బాలకృష్ణ

Thursday, March 4th, 2021, 12:06:02 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అయితే తెలుగు దేశం పార్టీ బలంగా ఉన్న చోట్ల కూడా వైసీపీ పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతు దారుల విజయం కి బాటలు వేసింది. అయితే మునిసిపల్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. అనంతపురం జిల్లా హిందూపురం లో నందమూరి బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యం లో అధికార పార్టీ వైసీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రం లో నలుగురు మంత్రులతో మాఫియా నడుపుతున్నారు అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తనను విమర్శించే వైసీపీ నాయకులు ఈ రెండేళ్లలో ఏం అభివృద్ది చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి అంటూ సవాల్ విసిరారు బాలకృష్ణ. బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ఈ ప్రభుత్వం పై ప్రజలు తిరగబడే రోజు వస్తుంది అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రం లో అన్ని విభాగాలను ప్రైవేట్ పరం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.