ఏపీలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతున్నాయి. మొదట్లో ప్రజలు, నాయకులు కరోనా పట్ల పలు జాగ్రత్తలు పాటించినప్పటికి ఇప్పుడు కాస్త నిర్లక్ష్యంగా ఉండడంతో మళ్ళీ కొందరు రెండో సారి కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు రెండోసారి కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు కరోనా రావడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.
అప్పుడు కరోనా నెగెటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే మళ్ళీ ఇప్పుడు బచ్చుల అర్జునుడుకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.