ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుంది.. సీఎం జగన్‌కు ఎంపీ రామ్మోహన్ సూటి ప్రశ్న..!

Wednesday, June 9th, 2021, 06:42:43 PM IST


ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సూటి ప్రశ్న వేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుందని, అందుకు సీఎం జగన్ ఏం చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీని గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పి సీఎం జగన్ మోసం చేశారని, దీనిపై యువత నిలదీయాలని అన్నారు. తనపై ఉన్న కేసుల కోసం లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని అన్నారు.

అయితే ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో జగన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తీసుకువస్తానని అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓట్ల కోసం ప్రత్యేక హోదా అంశాన్ని వాడుకున్నారని అన్నారు. అవినీతి కేసుల్లో జైలుకు పంపిస్తారనే భయంతోనే సీఎం జగన్ కేంద్రాన్ని హోదా గురుంచి గట్టిగా అడగలేకపోతున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.