పట్టణ ప్రజలకు ఉచితంగా మంచి నీరు.. మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ హామీ..!

Friday, March 5th, 2021, 12:40:52 AM IST

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీనీ గెలిపించాలని ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. రాబోయే మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే పట్టణ ప్రజలకు ఉచిత రక్షిత మంచినీటి కనెక్షన్‌, సున్నా నీటి పన్నుతో అందరికీ ప్రాథమిక హక్కుగా సురక్షిత తాగునీరు అందిస్తామని అన్నారు. సురక్షిత నీటిని ప్రజలకు అందించడంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో కలుషిత నీటి కారణంగా 2020 డిసెంబరులో వింత వ్యాధి వెలుగులోకి వచ్చిందని, దీంతో సుమారు 700 మంది ఆస్పత్రి పాలయ్యారని కళా వెంకట్రావ్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు కలుషిత నీరు తాగి కర్నూలులో ఒకరు ప్రాణాలు కోల్పోగా 50 మంది అనారోగ్యం పాలయ్యారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి వంటి మున్సిపాలిటీలు మంచినీటి సమస్యతో సతమతమవుతున్నారని, నీటి సరఫరా బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడమే దీనికి ప్రధాన కారణమని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 12 కార్పొరేషన్ల అభివద్ధి, మంచినీటి సరఫరా, మురుగునీటి కాల్వల మరమ్మతులకు ఝ్ణ్ణూఋం పథకాల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు 1,449 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, అదే విధంగా 14వ ఆర్థిక సంఘం ద్వారా మరో 1,986 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కళా వెంకట్రావ్ చెప్పుకొచ్చారు.