షాకింగ్: కరోనా బారిన పడి చనిపోయిన ఏపీ మాజీ మంత్రి..!

Thursday, April 1st, 2021, 10:03:43 PM IST


ఏపీలో రోజు రోజుకు మళ్ళీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత ఏడాది కరోనా బారిన పడి సామాన్య జనంతో పాటు, చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు చనిపోయారు. అయితే తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నడకుదిటి నరసింహారావు కూడా కరోనాతో మృతిచెందారు. కొద్ది రోజుల క్రితం క్రితం కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు సాయంత్రం కన్నుమూశారు. అయితే మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు నరసింహారావు మామ అవుతాడు. అయితే కరోనాతో నరసింహారావు మృతి చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.