ఇకపై మా రియాక్షన్ చూడండి!

Friday, June 12th, 2015, 04:03:11 PM IST


ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసు కోర్టు పరిధిలో ఉందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్రం పరిధిలో ఉందని వివరించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారాలకు దిగుతోందని యనమల అభిప్రాయపడ్డారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ట్యాపింగ్ వ్యవహారంలోని అన్ని ఆధారాలను నివేదిక రూపంలో కేంద్రానికి పంపామని తెలిపారు. అలాగే కేంద్రం ఈ వ్యవహారంలో అతిత్వరలో ఒక నిర్ణయానికి వస్తుందని భావిస్తున్నామని యనమల పేర్కొన్నారు. ఇక తెరాస ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకున్నా, దానికి తగ్గట్టుగా తమ నుండి రియాక్షన్ వస్తుందని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.