అందాల బొమ్మ.. అర్ధాంతరంగా కన్నుమూసింది!

Saturday, May 16th, 2015, 05:44:17 PM IST


ముంబై గోర్ గావ్ ప్రాంతంలోని వన్రాయ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఘోరం జరిగింది. కాగా పోలీస్ స్టేసన్ ఎదుట ఆటో కోసం ఎదురు చూస్తున్న ఒక యువతిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. ఇక వివరాల్లోకి వెళితే ముంబై అంధేరీ ప్రాంతంలో నివసిస్తున్న అర్చనా పాండ్యా టాటా కన్సెల్టెన్సీలో ఉద్యోగం చేస్తోంది. కాగా బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం వేచి ఉన్న అర్చనను పోలీసు స్టేషన్ ఎదుటే ఒక వాహనం ఢీకొంది.

ఇక ఘటనా స్థలంలో తీవ్ర గాయాలతో పడిఉన్న అర్చనను ఎవరూ పట్టించుకోకపోవడంతో 20 నిమిషాల తర్వాత సమాచారం అందుకుని పోలీసులు వచ్చి ఆసుపత్రికి తరలించారు. ఇక అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె మార్గంలోనే ప్రాణాలను కోల్పోయింది. ఇక అర్చన ఆక్సిడెంట్ విషయం పోలీసులు తనకు పోలీసులు ఫోన్ చేసి చెప్పారని, తాను ఆసుపత్రికి వెళ్ళే సరికే ఆమె మరణించిందని అర్చన సోదరుడు కన్నీటి పర్యంతం అయ్యాడు. కాగా అర్చనను ఢీకొని హిట్ అండ్ రన్ కు పాల్పడిన వాహనం వివరాలు ఇంకా తెలియరాలేదు.