రాజీనామా చేసేందుకు సిద్దమా.. మంత్రి కేటీఆర్‌కు తీన్మార్ మల్లన్న సవాల్..!

Saturday, February 27th, 2021, 01:24:44 AM IST


తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి కేటీఆర్ చెప్పడంతో దీనిపై ప్రస్తుతం ప్రతిపక్షాల నుంచి సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. దీంతో నిన్న మంత్రి కేటీఆర్ పలు శాఖల్లో భర్తీ చేసిన వివరాలను బహిరంగ లేఖ ద్వారా బయటపెట్టి దీనిపై ఎవరికైనా అనుమానాలుంటే ఆయా శాఖలతో ధృవీకరించుకోవాలని కౌంటర్ ఇచ్చారు.

అయితే తాజాగా దీనిపై స్పందించిన నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన మంత్రి కేటీఆర్ చెబుతున్నట్టు 1.32 లక్షల ఉద్యోగాలు టీఆర్ఎస్ ఇచ్చి ఉంటే పట్టభద్రుల ఎన్నికలకు ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. అయితే అన్ని ఉద్యోగాలు భర్తీ కాలేదని తాని నిరూపిస్తానని కేటీఆర్ రాజీనామా చేసేందుకు సిద్దమేనా అని సవాల్ విసిరారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా చాలా మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లను నిరుద్యోగులను చేస్తే తప్పా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని అన్నారు.