మెట్రో రైలు అలైన్మెంట్ పై చర్చ!

Tuesday, March 24th, 2015, 10:05:46 PM IST


తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మంగళవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు త్వరలో రానున్న మెట్రో రైలు అలైన్మెంట్ మార్పులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మొత్తం మూడు ప్రాంతాలలో మెట్రో రైలు అలైన్మెంట్ మార్పుల గురించి ప్రతిపాదనలు రావడంతో వీటిపై ఎల్ అండ్ టీ అధికారులతో కూడా రాజీవ్ శర్మ సమావేశంలో చర్చించారు. ఇక ఈ మేరకు మెట్రోకు అవసరమైన ప్రైవేట్ ఆస్తుల సేకరణను వేగవంతం చెయ్యాలని తెలంగాణ సీఎస్ ఆదేశించారు. అలాగే అలైన్మెంట్ మార్పుల వల్ల మొత్తం ఎంత ఆర్దిక భారం పడబోతోందన్న విషయంపై నివేదికను ఇవ్వాల్సిందిగా రాజీవ్ శర్మ అధికారులను కోరారు.