మొత్తానికి మరోసారి నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయిన కేసీఆర్..!

Monday, July 6th, 2020, 12:00:06 AM IST

తెలంగాణ గవర్నమెంట్ కు కరోనా దెబ్బ మాములుగా తగల్లేదు అని చెప్పాలి. కరోనా ఎంటర్ కాబడిన సమయంలో ముందు అంతా జోకులు వేసి తర్వాత సీరియస్ గా తీసుకొని ఒక రేంజ్ లో హైలైట్ అయ్యారు. ఒక నెలన్నర కితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే ఆ ఇంపాక్ట్ ఒక రేంజ్ లో ఉండేది.

ప్రజలకు ఏ విధంగా ధైర్యం చెప్తున్నారు ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అన్న అంశాలు ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా మొత్తం జాతీయ స్థాయిలోనే ఒక ఉత్తమ సీఎం వైరల్ అయ్యారు. కానీ ఇప్పుడు కూడా మళ్లీ నేషనల్ స్థాయిలో ట్రెండ్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు ఒక అసమర్థ ముఖ్యమంత్రి గా ట్రెండ్ అయ్యారు.

ఈగ కూడా వాలనీయని ఎన్నో ప్రగల్బాలు చెప్పిన కేసీఆర్, కరోనా రహిత తెలంగాణ చేసి చూపిస్తా అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు కేసీఆర్ కనిపించడం లేదు అని పెద్ద ఎత్తున ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. దీనితో కేసీఆర్ ను పొగిడిన వారు అంతా తిట్టిన వారు అయ్యారు.