కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా తెలంగాణ పాలిట శాపమే – కాంగ్రెస్ పార్టీ

Thursday, April 22nd, 2021, 10:23:06 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. దీని తీవ్రత ఎక్కువగా ఉండటం తో మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు ఎంత సమర్థవంతంగా ఉన్నప్పటికీ, పలు చోట్ల జరుగుతున్న సంఘటనల తో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పై, తెరాస ప్రభుత్వం పై మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది.

దేశం పాలిట మోడీ శాపమైతే, ఈ మహిళ మరణానికి కారణమైన కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా తెలంగాణ పాలిట శాపమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే కరోనా పాజిటివ్ కేసుల విషయం లో మరియు మరణాల విషయం లో తెలంగాణ సర్కార్ లెక్కలు దాస్తోంది అంటూ ఇప్పటికే చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. ప్రతి పక్ష పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలకి తాజాగా జరిగిన ఒక ఘటన తో మరింత విమర్శల పాలు అవుతోంది. అసలు లెక్కలు ఎందుకు దాచి పెడుతున్నావ్ కేసీఆర్ అంటూ సూటిగా ప్రశ్నించారు తెలంగాణ కాంగ్రెస్. అలా దాచి పెట్టడం వలన నీకొచ్చే లాభం ఏమిటి అంటూ సూటిగా ప్రశ్నించింది. కరోనా లక్షణాల తో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న జయమ్మ 48 ఏళ్ల ఒక మహిళను కరోనా వైరస్ పాజిటివ్ సర్టిఫికెట్ లేదని గాంధీ ఆసుపత్రి లో చేర్చుకోలేదు స్టాఫ్. అయితే అంబులెన్స్ లోనే ఎదురు చూస్తూ కొడుకు కళ్లముందే తల్లి మరణించడం జరిగింది. అయితే ఈ ఘటన తమ దృష్టికి రాలేదు అని గాంధీ నోడల్ అధికారి ప్రభాకర్ వివరణ ఇచ్చారు.