ఆస్ట్రేలియా బీచ్ లో ఉల్లాసభరితంగా గడపడానికి, సముద్ర స్నానానికని వెళ్లిన ముగ్గురు తెలంగాణా వ్యక్తులు అకస్మాత్తుగా ఆ బీచ్ లో గల్లంతయ్యారు. ఆ బీచ్ లో గల్లంతైన వారిలో ఇద్దరు అప్పటికే మృతి చెందగా, మరొక వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన గౌసుద్దీన్(45), రాహత్(35) మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన మరొక వ్యక్తి జునేద్ కోసం అక్కడి అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ లో ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గల్లంతైన వారిలో గౌసుద్దీన్, జునేద్ నల్గొండ జిల్లా వాసులు కాగా.. రాహత్ హైదరాబాద్ బీహెచ్ఈఎల్ వాసి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సరదా కోసమనే బీచ్ కి వెళ్లిన వారు, వారి కుటుంబాలకి తీరని శోకాన్ని మిగిల్చారు.
ఆస్ట్రేలియా బీచ్ లో తెలంగాణ వ్యక్తులు గల్లంతు…
Tuesday, December 18th, 2018, 07:42:02 PM IST