ఏపీ కోవిడ్ అంబులెన్స్ లను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు

Monday, May 10th, 2021, 01:06:59 PM IST


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరణాలు సైతం భారీగా నమోదు అవుతున్నాయి. అయితే ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. అయితే తెలంగాణ రాష్ట్రం లోకి వాహనాల అనుమతి ఉన్నప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కోవిడ్ అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం, రామాపురం లోని అంతరాష్ట్ర సరిహద్దు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ గేట్ వద్ద తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ లు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడికి కోవిడ్ రోగులతో వస్తున్న అంబులెన్స్ లని వెనక్కి పంపుతున్నారు పోలీసులు.

అయితే హైదరాబాద్ లో పడకలు మరియు ఆక్సిజన్ అందుబాటు లో లేవని పోలీసులు చెబుతున్నారు. అంతేకాక ఏపీ లో భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు వెలుగు చూస్తుండడం తో కరోనా వైరస్ రోగులకు అనుమతి లేదు. అయితే అయితే కర్నూల్ పోలీసులు, తెలంగాణ పోలిసులతో మాట్లాడి, ఆసుపత్రుల హామీ మేరకు అంబులెన్స్ లను తెలంగాణ లోకి అనుమతి ఇస్తున్నారు. అయితే సాధారణ వాహనాలను యధావిధిగా అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదు కావడం తో పోలీసులు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు.