తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి 9, 10వ తరగతుల విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో పదో తగరతి పరీక్షల తేదీలను విద్యాశాఖ ఖరారు చేసింది. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహించే విధానం ఉండగా ఈ సారి మాత్రం ఆరు సబ్జెక్టులకు 6 పరీక్షలే నిర్వహించనున్నట్టు తెలిపారు.
అలాగే నాలుగు ఫార్మెటివ్ అసెస్మెంట్ టెస్టులకు గాను రెండు ఫార్మెటివ్ అసెస్మెంట్ టెస్టులను మాత్రమే నిర్వహించనున్నారు. మార్చి 15న మొదటి ఎఫ్ఏ టెస్టు, ఏప్రిల్ 15న రెండో ఎఫ్ఏ టెస్టు జరపనున్నట్టు తెలిపారు. ఇక సమ్మేటివ్ అసెస్మెంట్ను మే 7 నుంచి 13వ తేదీ మధ్యలో నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఇదిలా ఉంటే 9, 10వ తరగతుల విద్యార్థులు స్కూల్కు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేదని, హాజరు శాతం లేనప్పటికీ విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు అనుమతిస్తున్నట్టు తెలిపారు.
ఇక హైదరాబాద్లో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు జరగనుండగా, మిగతా జిల్లాల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. అదే ఆన్లైన్ క్లాసులు అయితే 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య, 9వ తరగతి విద్యార్థులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య నిర్వహించబోతున్నారు.