పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్…పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం!

Friday, May 22nd, 2020, 04:30:39 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే వీటిని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉన్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు జూన్ 8 నుండి 10 వ తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. అయితే ప్రతి పరీక్షలు రెండు రోజుల విరామం తప్పనిసరి చేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పరీక్షలు అన్ని ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పరీక్షలు జూన్ 8 నుండి జులై 5 వ తేదీ వరకు జరగనున్నాయి.

జూన్ 8 న ఇంగ్లీష్ మొదటి పేపర్, 11 న ఇంగ్లీష్ రెండవ పేపర్ నిర్వహించ నున్నారు.
జూన్ 14 న మాథ్స్ మొదటి పేపర్, 17 న మాథ్స్ రెండవ పేపర్ నిర్వహించ నున్నారు.
జూన్ 20 న సామాన్య శాస్త్రం మొదటి పేపర్, 23 న సామాన్య శాస్త్రం రెండవ పేపర్ నిర్వహించ నున్నారు.
జూన్ 26 న సాంఘిక శాస్త్రం మొదటి పేపర్, 29 న సాంఘిక శాస్త్రం రెండవ పేపర్ నిర్వహించ నున్నారు.
అలానే జూలై 2 న ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ మొదటి పేపర్ నిర్వహించ నున్నారు.
జూలై 5 న ఓరియంటల్ లాంగ్వేజ్ రెండవ పేపర్ నిర్వహించ నున్నారు. అలానే అదే రోజు ఒకేషనల్ కోర్సు కి సంబంధించిన తీరి పరీక్షను నిర్వహించ నున్నారు.

అయితే ఈ పరీక్షల నేపధ్యంలో పరీక్ష హాళ్ళల్లో భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలి అని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సూచించారు. ప్రస్తుతం 2,530 పరీక్షా కేంద్రాలు ఉండగా, అదనంగా మరో 2,005 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.