నెట్ లో హల్ చల్ చేస్తున్న.. చంటి పిల్లోడి వీడియో..!

Monday, February 8th, 2016, 09:55:27 AM IST


ఆ ఇల్లు పది అడుగుల ఎత్తులో ఉన్నది. ఇంటిపై పిట్టగోడ లేదు. పొరపాటున ఎవరైనా పైకి ఎక్కి ఏమాత్రం ఏమరపాటుగా ఉంటే ఇక అంతే సంగతులు. కిందపడిపోవడం ఖాయం. పెద్దవాళ్ళే అప్రమత్తంగా ఉండాలి అంటే ఇక చిన్నపిల్లల విషయం చెప్పెదేమున్నది. ఇక అప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నవ్యక్తులైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఈజీగా కిందపడిపోతారు. ఇదేవిధంగా ఓ సంవత్సరం వయసున్న చిన్న పిల్లోడు డాబామీదకు ఎక్కాడు. ఎలా ఎక్కాడు.. ఎందుకు ఎక్కాడు అన్నది అనవసరం. పైకి ఎక్కినా డాబా చివరికి వచ్చి నిలబడ్డాడు.

చూసి చూసి కిందకు దూకేశాడు. అయితే, కింద తండ్రి ఉండటంతో అమాంతం అతడిని పట్టుకున్నాడు. లేకుంటే.. ఏమయ్యేది. ఇక్కడ దూకిన పిల్లాడి గురించి కాదు. పట్టుకున్న తండ్రి గురించి మాట్లాడాలి. ఎందుకంటే.. కింద ఉన్న తండ్రి..డాబామీదున్న చంటి పిల్లవాడిని దూకమని ప్రోత్సహిస్తాడు. తండ్రి చెప్పడంతో దూకేస్తాడు ఆ పిల్లోడు. చిన్నపిల్లల్ని ఇలా దూకమని ప్రోత్సహించడం ఏమిటని నెటిజన్లు వాపోతున్నారు. ఆ తండ్రిని ఫాదర్ అఫ్ ది ఇయర్ గా నెటిజన్లు చెప్తున్నారు. ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్ లో విపరీతంగా హల్ చల్ చేస్తున్నది.