మన్మోహనుడికి కోర్టు సమన్లు!

Wednesday, March 11th, 2015, 12:55:04 PM IST


బొగ్గు గని క్షేత్రాల కేటాయింపు స్కాం కేసులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై మన్మోహన్ కు సీబీఐ స్పెషల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇక ఈ నేపధ్యంగా మాజీ ప్రధాని న్యాయస్థానానికి హాజరు కావాలని స్పెషల్ కోర్టు ఆదేశించింది. కాగా భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మన్మోహన్ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖను ఆయన పర్యవేక్షణలోనే ఉంచుకున్నారు. ఇక ఈ స్కాంపై విచారణ జరిపిన కోర్టు అప్పటి బొగ్గు శాఖామంత్రిని కూడా విచారించనిదే ఈ కేసులో తుది జాబితాను అంగీకరించనని పేర్కొన్న నేపధ్యంలోనే మన్మోహన్ కు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. కాగా మన్మోహన్ సింగ్ తో పాటు పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా, మాజీ బొగ్గు కార్యదర్శి పరాక్ లతో పాటు మరో ముగ్గురికి కోర్టు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.