మరో ఇద్దరు భారత నల్లకుబేరుల పేర్లు వెల్లడి!

Thursday, June 4th, 2015, 01:40:33 AM IST


స్విస్ బ్యాంకులో సొమ్ములు దాచుకున్న మరో ఇద్దరు భారత నల్లకుబేరుల పేర్లను స్విస్ తన గెజిట్ లో వెల్లడించింది. కాగా భారతదేశానికి చెందిన సయ్యద్ మహమ్మద్ మసూద్, చాంద్ కౌసర్ మహమ్మద్ మసూద్ ఖాతాలకు సంబంధించిన వివరాలను స్విస్ పేర్కొంది. అయితే అనేక పధకాల పేర్లతో చైన్ లింక్ వ్యాపారం చేస్తూ మోసం చేసినట్లు మసూద్ లపై ఇప్పటికే కేసులు నమోదై పలు కేసులు విచారణలో ఉన్నాయి.

ఇక గతంలో కూడా మసూద్ కు సంబంధించిన కొన్ని వివరాలను స్విస్ భారత్ కు అందించింది. అలాగే జర్మనీ, అమెరికా, పనామా దేశాలకు చెందిన పలువురి పేర్లతో పాటు బహామాస్ వార్ఫ్ లిమిటెడ్ సంస్థ వివరాలను స్విస్ ఈ గెజిట్ లో పొందుపరచింది. కాగా ఇప్పటి వరకు స్విస్ ఏడు మంది భారతీయుల బ్యాంకు ఖాతాల వివరాలను బహిర్గతం చేసింది.