భారత రచయితకు న్యూయార్క్ టైమ్స్ అరుదైన గౌరవం

Saturday, December 13th, 2014, 12:20:17 PM IST


అమెరికాలో ప్రఖ్యాత పత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ 2014 సంవత్సరంలో పేరుగాంచిన టాప్ టెన్ పుస్తకాలపై చేసిన రివ్యూలో ఢిల్లీలో పుట్టి అమెరికాలో పెరిగిన అఖిల్ శర్మ రెండవ నవల ‘ఫామిలీ లైఫ్’ ఒకటిగా నిలిచింది. కాగా ఈ పుస్తకాన్ని డబ్ల్యూ డబ్ల్యూ నార్టన్ అండ్ కంపెనీ వారు ప్రచురించిన ఈ పుస్తకంలో శర్మ కుటుంబ విలువలను లోతుగా, ప్రత్యేకమైన శైలిలో రచించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

ఇక శర్మ తన నవలలో ఇండియా నుండి అమెరికా క్వీన్స్ కి వలస వెళ్ళిన ఒక భారతీయ కుటుంబం యొక్క సెమి ఆటోబయోగ్రఫిని కధాంశంగా తీసుకున్నారు. స్విమ్మింగ్ పూల్ లో జరిగిన ఒక ప్రమాదం కారణంగా బ్రెయిన్ డామేజి జరిగిన పెద్ద కుమారుడి దుస్థితిపై ఆ కుటుంబం పడిన బాధను శర్మ తన నవలలో వివరించారు. ఇక హృదయాలను కదిలించేలా ఉన్న ఈ నవలను న్యూయార్క్ టైమ్స్ 2014 ప్రఖ్యాత రచనలలో ఒకటిగా గుర్తించి గౌరవించింది. కాగా అఖిల్ శర్మ ఎనిమిదేళ్ళ వయసులో ఇండియా నుండి ఎడిసన్ కు వలస వెళ్లి అక్కడే పెరిగారు. ఇక శర్మ తొలి రచన ‘ఆన్ ఓబీడియంట్ ఫాదర్’ 2001 లో పెన్ అవార్డును పొందింది.