ఆ ముగ్గురు పార్టీ ఓటమిని కోరుకున్నారు..!

Tuesday, March 10th, 2015, 03:34:29 PM IST


ఢిల్లీలో ఎవరూ ఊహించని విధంగా గెలుపొందిన సామాన్యుడి పార్టీ ఇప్పుడు అంతర్గత విభేదాలతో సతమతమావుతున్నది. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించినట్టు చెప్పుకుంటున్న పార్టీ కీలక నేతలు పార్టీ ఓటమిని కోరుకున్నారంట. ఈవిషయం పార్టీలో అంతర్గత విభేదాల అనంతరం బయటపడింది. పార్టీ సీనియర్ నేతలైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్ వంటి సీనియర్ నాయకులు ఆప్ ఓడిపోవాలని కోరుకున్నారని మనిష శిషోడియా, పంకజ్ గుప్తలు తెలియజేశారు. పార్టీకు సంబంధించిన కీలక రహస్యాలను మీడియాకు లీక్ చేశారనే విషయంపై యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లను పీఏసి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉండి, పార్టీ కోసం పాటుబడిన సీనియర్ వ్యక్తులు… ఆప్ ఓడిపోవాలని ఎందుకు కోరుకున్నారు. అసలు ఇది నిజామా..?కాదా? అన్నదానిపై పూర్తీ సమాచారం లేదు. పార్టీలో వీరంటే గిట్టని వాళ్ళు చేసిన ఆరోపణలు కావొచ్చు… లేదా పదవుల కోసమైనా ఇలా మాట్లాడి ఉండవచ్చు. ఢిల్లీలో పార్టీ అధికారం చేపట్టి ఇంకా నెలరోజులు కూడా కాకముందే… అప్పుడే అంతర్గత కుమ్ము లాటలు, కొట్లాటలతో అతలాకుతలం అవుతున్నది. ఇక ఈ విషయంపై స్పందించేందుకు ఢిల్లీ సిఎం కూడా ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన బెంగళూరులో వైద్యం చేయించుకుంటున్నారు. 10రోజుల పాటు అందుబాటులో ఉండరు.