విజయవాడలో అమెరికన్ కాన్సులేట్ లేనట్లే!

Thursday, December 4th, 2014, 01:47:26 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం అమెరికా రాజకీయ, మిలటరీ వ్యవహారాల కార్యదర్శి పునీత్ తల్వార్ తో సమావేశమైన సందర్భంగా విజయవాడలో అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటు చెయ్యమని అడుగగా ఆయన సుముఖంగా స్పందించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై అమెరికా కాన్సులేట్ జనరల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు తాము విజయవాడలో కాన్సులేట్ ఏర్పాటు చెయ్యటం లేదని, కొత్తగా కాన్సులేట్ కార్యాలయాలు ఎక్కడా ప్రారంభించడంలేదని స్పష్టం చేసింది. ఇక దీనితో రాష్ట్ర విభజన నేపధ్యంగా వేరుపడిన నవ్యాంద్ర ప్రదేశ్ లో అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటు కాబోతోందని వస్తున్న వార్తలకు తెరపడినట్లైంది.