అత్యంత శక్తివంతమైన భారత మహిళలు వీరే!

Thursday, February 26th, 2015, 07:35:30 PM IST


ప్రపంచంలోని వివిధ కార్పోరేట్ స్థాయి కంపెనీలకు చెందిన మేటి సీఈఓలు, ఎండీలను ప్రతీ ఏటా గుర్తించే ఫోర్బ్స్ పత్రిక తాజాగా జాబితాను విడుదల చేసింది. కాగా 50మందితో విడుదల చేసిన ఈ జాబితాలో ఆరుగురు భారత నారీమణులకు చోటు దక్కింది. వీరిలో భారత్ లో అత్యంత శక్తివంతమైన మహిళా వాణిజ్యవేత్తగా ఎస్ బీఐ చైర్ పర్శన్ అరుంధతీ భట్టాచార్యను ఫోర్బ్స్ మరోసారి ఎన్నిక చేసింది.

ఇక అరుంధతి తరువాత వరుసగా ఐసీఐసీఐ సీఈఓ చందా కొచ్చర్, శ్రీరాం లైఫ్ ఇన్సురెన్స్ ఎండీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అఖిలా శ్రీనివాసన్, బయోకాన్ ఫౌండర్ చైర్మన్ ఎండీ కిరణ్ మజుందార్, యాక్సిస్ బ్యాంక్ సీఈఓ ఎండీ శిఖా శర్మ, లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ ఉషా సంగ్వాన్ లు చోటు దక్కించుకున్నారు.