బిగ్ న్యూస్ : కరోనా సమయంలో ట్రాక్టర్ల ర్యాలీ చేసిన వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..!

Saturday, July 18th, 2020, 03:11:32 PM IST

ప్రస్తుతం కరోనా కారణంగా అంతా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు సమర్ధవంతమైన చర్యలను చేపట్టిన ఈ ఏపీ ప్రభుత్వం ఒక రెండు నెలల ముందుకు వెళ్తే ఎలాంటి చర్యలు తీసుకుందో గుర్తు చేసుకోవాలి. అవగాహన కల్పించాల్సిన ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా లాక్ డౌన్ ను ఉల్లంఘించి పెద్ద పెద్ద ర్యాలీలే నిర్వహించారు.

దేశం అంతా పటిష్టమైన లాక్ డౌన్ లో ఉంటే వైసీపీ కు చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధు సూధన్ రెడ్డి ట్రాక్టర్లుతో భారీ ర్యాలీ చేసుకొని జాతీయ స్థాయి వార్తల్లో ఎక్కి ఏపీ పరువు తీశారు. అప్పుడు కరోనా సమయంలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన అదే ఎమ్మెల్యేకు ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్ రాగా వారు ఇప్పుడు తిరుపతిలో వైద్యం తీసుకుంటున్నారట. ఏ కరోనాను లెక్క చెయ్యకుండా అయితే ర్యాలీలు నిర్వహించారో ఇప్పుడు అదే ఎమ్మెల్యే కరోనా బారిన పడడం గమనార్హం.