ఖమ్మం లో అమానవీయ ఘటన… కోతిని ఉరేసి చంపి..

Monday, June 29th, 2020, 11:43:07 AM IST

ఇప్పటివరకు మనం ఎన్నో దారుణ ఘటనలు చూసాం. అయితే ఖమ్మం లో అమ్మ పాలెం లో ఒక కోతి ను ఉరేశి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక చెట్టు వద్ద తొట్టెలో నీటిని తాగడానికి వచ్చిన కోతి, తాగుతూ అందులో పడిపోయింది. అప్పటికే మునిగి ఉన్న కోతిని రాళ్లతో కొట్టి చంపేయడం జరిగింది. అక్కడికి కోతులు గుంపులుగా రావడం తో మరొక కోతిని అక్కడి చెట్టు కు కట్టేసి ఉరేసీ చంపేశారు. అక్కడి వనరులను తరిమెందుకు అలా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ముగ్గురు పై పోలీసులు కేసు నమోదు చేశారు. సాడు వెంకటేష అనే వ్యక్తి ఇంటి ముందు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఘటన కి సంబంధించిన వ్యవహారం వీడియో రూపం లో సోషల్ మీడియా లో ప్రత్యక్షం అయింది. అయితే ఈ ఘటన పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతు ప్రేమికులు మాత్రం ఇలాంటి దారుణ ఘటన ఇంకెక్కడ చూడలేదు అని వ్యాఖ్యానించారు. పోలీసులు వెంకటేష, జోసెఫ్, గణపతి అనే ముగ్గురి పై కేసు నమోదు చేసి నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.