కరోనా అప్డేట్: ఏపీలో కొత్తగా మరో 114 కరోనా కేసులు..!

Saturday, January 16th, 2021, 10:00:52 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 25,542 శాంపిల్స్‌ని పరీక్షించగా 114 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన నేడు ఎవరూ మృతి చెందలేదు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,824 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1,987 మంది చికిత్స పొందుతుండగా 8,76,698 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 326 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,139 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,40,181 శాంపిల్స్ పరీక్షించారు.