ఏపీలో అంతకంతకు పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే?

Thursday, April 1st, 2021, 06:48:20 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. కొద్ది రోజుల నుంచి మళ్ళీ రోజు వారీ కేసుల సంఖ్య వెయ్యికి పైగా నమోదవుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 31,809 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,271 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన నేడు ముగ్గురు మృతి చెందారు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,03,260 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 8,142 మంది చికిత్స పొందుతుండగా 8,87,898 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 464 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,220కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,51,14,988 శాంపిల్స్ పరీక్షించారు.