కరోనా అప్డేట్: ఏపీలో బారీగా తగ్గిన కరోనా కేసులు..!

Monday, January 4th, 2021, 07:28:27 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 29,714 శాంపిల్స్‌ని పరీక్షించగా 128 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,210 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 2,943 మంది చికిత్స పొందుతుండగా 8,73,149 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 252 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,118 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,20,02,494 శాంపిల్స్ పరీక్షించారు.