ఏపీలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Friday, April 2nd, 2021, 06:48:12 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కొద్ది రోజుల నుంచి మళ్ళీ రోజు వారీ కేసుల సంఖ్య వెయ్యికి పైగా నమోదవుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 31,116 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,288 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన నేడు ముగ్గురు ఐదు మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,04,548 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 8,815 మంది చికిత్స పొందుతుండగా 8,88,508 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 610 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,225కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,51,46,104 శాంపిల్స్ పరీక్షించారు.