ఏపీలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా మరో 1,326 పాజిటివ్ కేసులు..!

Monday, April 5th, 2021, 06:04:49 PM IST

ఏపీలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. కొద్ది రోజుల నుంచి మళ్ళీ రోజు వారీ కేసుల సంఖ్య వెయ్యికి పైగా నమోదవుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 30,678 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,326 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన నేడు ఏకంగా ఐదు మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,09,002 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 10,710 మంది చికిత్స పొందుతుండగా 8,91,048 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 911 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,244కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,52,39,114 శాంపిల్స్ పరీక్షించారు.