ఏపీలో కరోనా ఉగ్రరూపం.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు..!

Sunday, April 4th, 2021, 03:00:03 AM IST

ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. కొద్ది రోజుల నుంచి మళ్ళీ రోజు వారీ కేసుల సంఖ్య వెయ్యికి పైగా నమోదవుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 31,260 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,398 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన నేడు ఏకంగా తొమ్మిది మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,05,946 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 9,417 మంది చికిత్స పొందుతుండగా 8,89,295 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 787 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,234కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,51,77,364 శాంపిల్స్ పరీక్షించారు.