భారత్‌లో నేడు కొత్త కరోనా కేసులు ఎన్నంటే?

Saturday, January 16th, 2021, 12:24:11 PM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనాకు నేటి నుంచి టీకా కూడా అందుబాటులోకి రావడంతో ముందు ముందు కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,158 కరోనా కేసులు నమోదు కాగా, 175 మంది కరోనాతో మరణించారు.

అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,42,841కి చేరింది. ప్రస్తుతం అందులో 2,11,033 యాక్టివ్ కేసులు ఉండగా, 1,01,79,715 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,52,093 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 16,977 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 96.6 శాతం ఉండగా, మరణాల రేటు 1.4 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.