కరోనా అప్డేట్: ఏపీలో కొత్తగా మరో 173 కరోనా కేసులు..!

Wednesday, January 20th, 2021, 08:38:39 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 46,850 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 173 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వల్ల నేడు ఎటువంటి మరణం సంభవించలేదు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,418 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1,637 మంది చికిత్స పొందుతుండగా 8,77,639 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 196 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,142 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,26,90,165 శాంపిల్స్ పరీక్షించారు.