ఏపీలో ఆగని కరోనా కేసులు.. రికార్డ్ స్థాయిలో మరణాలు..!

Sunday, May 9th, 2021, 03:00:16 AM IST

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటలలో 1,10,571 శాంపిల్స్‌ని పరీక్షించగా 20,065 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 96 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,65,439కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1,87,392 మంది చికిత్స పొందుతుండగా 10,69,432 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 19,272 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8,615కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,72,62,441 శాంపిల్స్ పరీక్షించారు.