హెల్త్ బులెటిన్: తెలంగాణలో కొత్తగా మరో 2,103 కేసులు..!

Wednesday, September 30th, 2020, 09:41:07 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా రోజుకు 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా మొన్న ఆ సంఖ్య కాస్త తగ్గినా మళ్ళీ నిన్నటి నుంచి పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటలలో 2,103 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 11 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,243 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,386 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,60,933 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 29,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,127 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 55,359 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 29,96,001 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 84.08 శాతం ఉండగా, మరణాల రేటు 0.58% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.