ఏపీలో కొత్తగా 21,452 కరోనా కేసులు.. మరో 94 మంది మృతి..!

Wednesday, May 12th, 2021, 07:30:16 PM IST

ఏపీలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటలలో 90,750 శాంపిల్స్‌ని పరీక్షించగా 21,452 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 94 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,44,386కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1,97,370 మంది చికిత్స పొందుతుండగా 11,38,028 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 19,095 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8,988కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,76,05,687 శాంపిల్స్ పరీక్షించారు.