తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా మరో 2,239 కేసులు..!

Saturday, September 26th, 2020, 09:50:13 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటలలో 2,239 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 11 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,281 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,83,866 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,52,441 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 30,334 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1091 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 58,925 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 28,00,761 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 82.90 శాతం ఉండగా, మరణాల రేటు 0.59% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.