ఏపీలో నేడు మరింత భారీగా పెరిగిన కరోనా కేసులు..!

Wednesday, April 7th, 2021, 09:32:32 PM IST

ఏపీలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. కొద్ది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 31,812 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,331 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన నేడు ఏకంగా 11 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,13,274 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 13,276 మంది చికిత్స పొందుతుండగా 8,92,736 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 853 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,262కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,02,583 శాంపిల్స్ పరీక్షించారు.