ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు.. నేడు ఒక్కరే మృతి..!

Thursday, January 7th, 2021, 08:01:42 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 59,410 శాంపిల్స్‌ని పరీక్షించగా 295 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన నేడు ఒక్కరే మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,171 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 2,822 మంది చికిత్స పొందుతుండగా 8,74,223 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 368 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,126 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,21,64,531 శాంపిల్స్ పరీక్షించారు.