బారత్‌లో తగ్గని కరోనా ప్రభావం. కొత్తగా ఎన్ని కేసులంటే?

Saturday, November 14th, 2020, 02:12:53 PM IST

భారత్‌లో కరోనా ప్రభావం ఇంకా తగ్గడం లేదు. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా ఇప్పుడు అది కాస్త తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో 44,684 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో మరో 520 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 87,73,479 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 4,80,719 యాక్టివ్ కేసులు ఉండగా, 81,63,572 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,29,188 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 47,992 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 9,29,491 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 93 శాతం ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.