ఏపీలో ఆగని కరోనా బీభత్సం.. కొత్తగా మరో 5,963 పాజిటివ్ కేసులు..!

Monday, April 19th, 2021, 10:00:56 PM IST

ఏపీలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. కొద్ది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 37,765 శాంపిల్స్‌ని పరీక్షించగా 5,963 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 27 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,000 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 48,053 మంది చికిత్స పొందుతుండగా 9,12,510 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 2,569 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,437కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,57,15,757 శాంపిల్స్ పరీక్షించారు.