ఏపీలో కరోనా కల్లోలం.. గడిచిన 24 గంటల్లో 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు..!

Friday, April 16th, 2021, 09:00:43 PM IST

ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. కొద్ది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 35,962 శాంపిల్స్‌ని పరీక్షించగా 6,096 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 20 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,48,231 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 35,592 మంది చికిత్స పొందుతుండగా 9,05,266 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 2,194 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,373కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,56,06,163 శాంపిల్స్ పరీక్షించారు.